సారథిన్యూస్, హైదరాబాద్: హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో తెలంగాణ రాష్ట్ర సచివాలయ కూల్చివేత పనులు ప్రారంభమయ్యాయి. మంగళవారం తెల్లవారుజామునుంచే భారీ బందోబస్తు నడుమ కూల్చివేతను ప్రారంభించారు. అదే స్థానంలో కొత్తసచివాలయాన్ని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కూల్చివేతకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు తీయకుండా పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సచివాలయానికి ఉన్న అన్నివైపులా ద్వారాలను మూసివేశారు. సాధ్యమైనంత తొందరగా కూల్చివేత ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.