సారథి న్యూస్, హైదరాబాద్ : రాష్ట్రానికి తెలంగాణ జల వైతాళికుడు ఆర్.విద్యాసాగర్ రావు సేవలు ఎప్పటికీ మరువలేనివని రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్ రావు గుర్తుచేశారు.
బుధవారం విద్యాసాగర్ రావు మూడవ వర్ధంతి సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమైక్య పాలనలో సాగునీటి రంగంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను ఎలుగెత్తి చాటిన మహనీయుడని కొనియాడారు. కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ కోల్పోయిన ప్రతి నీటిబొట్టును లెక్కగట్టిన గొప్ప జలనిపుణుడని, చివరి శ్వాసవరకు తెలంగాణ సాగు నీటి రంగానికి చేసిన సేవలు వెలకట్టలేనివన్నారు.