Breaking News

రేప్​చేసి వీడియో తీశారు..


ఉత్తర్​ప్రదేశ్​లో లైంగికదాడుల పర్వం కొనసాగుతున్నది. హత్రాస్​ ఘటనకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు సాగుతున్న వేళ మరో దారుణం చోటుచేసుకున్నది. తాజాగా ఓ పదిహేడేండ్ల విద్యార్థినిపై ఓ నీచుడు లైంగికదాడి చేయగా అతడి ఫ్రెండ్స్​ వీడియో తీశారు. ఉత్తర్​ప్రదేశ్​ ఝాన్సీకి చెందిన ఓ యువతి అదే పట్టణంలో పాల్​టెక్నిక్​ చదువుతున్నది. కొంతకాలంగా ఆమెను ఓ యువకుడు లైంగికంగా వేధిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం కాలేజీకి వెళ్లిన విద్యార్థినిని సదరు యువకుడు కిడ్నాప్​ చేసి తీసుకెళ్లాడు. ఆనంతరం ఓ ఇంట్లోకి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనను అతడి ఫ్రెండ్స్​ వీడియో తీశారు. ఇంట్లో చెబితే వీడియోలు సోషల్​మీడియాలో పెడతామంటూ బెదిరించారు. యువతి పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదుచేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.