సారథి న్యూస్, హైదరాబాద్: హైదరాబాద్ మహానగరంలో వరుసగా నాలుగో రోజు వరద ప్రభావిత ప్రాంతాలను తెలంగాణ రాష్ట్ర మున్సిపల్, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు పరిశీలించారు. రాజేంద్రనగర్ పరిసర ప్రాంతాల్లో వరదల్లో చనిపోయిన పలువురికి రూ.ఐదులక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా చెక్కులను అందజేశారు. పారిశుద్ధ్యంపై ప్రధానంగా దృష్టిసారించాలని జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. అంటురోగాలు ప్రబలకుండా అన్నిరకాల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆయన వెంట రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ రంజిత్ రెడ్డి, ఎంఐఎం హైదరాబాద్ పార్లమెంట్సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ, స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీమేయర్ బాబా ఫసియుద్దీన్, కార్పొరేటర్లు, అధికారులు ఉన్నారు.