ప్రముఖ నటి రకుల్ ప్రీత్‌సింగ్ శుక్రవారం ఎన్సీబీ ఎదుట హాజరైన విషయం తెలిసిందే. ఆమెను సుమారు 4 గంటలపాటు ఎన్సీబీ అధికారులు ప్రశ్నించారు. అయితే చాలా ప్రశ్నలకు రకుల్ తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా అంటూ సమాధానం చెప్పిందట దీంతో అధికారులు షాక్‌కు గురయ్యారని సమాచారం. మరోవైపు రియాతో రకుల్ చాట్చేసినట్టు ఎన్సీబీకి కీలక ఆధారాలు లభించాయి. దీంతో చాటింగ్ కు సంబంధించిన స్క్రీన్షాట్లను వారు రకుల్‌కు చూపించినట్టు టాక్.
అయితే తాను రియాతో డ్రగ్స్‌కు గురించి చాటింగ్ చేసింది నిజమేనని.. కానీ తాను డ్రగ్స్ మాత్రం తీసుకోలేదని.. డ్రగ్స్ మాఫియాతో తనకు ఏ విధమైన సంబంధం లేదని రకుల్ చెప్పిందట. కాగా మరోరోజు రకుల్ ప్రీత్‌సింగ్‌ను అధికారులు ప్రశ్నించే అవకాశం ఉన్నది. అయితే రకుల్ ముంబై వెళ్లిన ప్రతిసారి రియా చక్రవర్తితో క్లోజ్‌గా ఉంటుంది. వీళ్లిద్దరూ కలిసి ఎన్నోసార్లు పార్టీలకు హాజరయ్యారు. దీంతో రకుల్‌పై అనుమానాలు వెల్లువెత్తాయి. అయితే రకుల్ ప్రీత్‌సింగ్‌కు నిజంగానే డ్రగ్స్కేసుతో ఏ సంబంధం లేదా.. ఆమె బాధితురాలా? లేక నిందితురాలా అన్న విషయం త్వరలో తేలనున్నది.