సారథిన్యూస్, శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన జలకళ పథకం పేదరైతులకు వరం లాంటిదని సీఎం వైస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ఈ పథకంలో భాగంగా రాష్ట్రంలో 2 లక్షల వ్యవసాయ బోర్లు వేస్తున్నట్టు చెప్పారు. సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం జగన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో వచ్చే నాలుగు సంవత్సరాలలో రూ.2,340 కోట్లతో 2 లక్షల బోర్లు ఉచితంగా వేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అన్నారు.
ఈ పథకం కోసం రైతులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. శ్రీకాకుళం కలెక్టరేట్లో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న స్పీకర్ తమ్మినేని సీతారాం జలకళ కు సంబంధించిన పోస్టర్లు, కరపత్రాలు ఆవిష్కరించారు. కార్యక్రమంలో కలెక్టర్ జె నివాస్, జాయింట్ కలెక్టర్లు సుమిత్ కుమార్, ఆర్.శ్రీరాములు నాయుడు, ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్, డీసీసీబీ చైర్మన్ పాలవలస విక్రాంత్, జిల్లా నీటి యాజమాన్య సంస్థ పిడి హెచ్. కూర్మారావు, వ్యవసాయ శాఖ జేడీ కే శ్రీధర్, ఈపీడీసీఎల్ ఎస్ఈ ఎన్. రమేష్, భూగర్భ జలాల శాఖ డీడీ ఎస్ లక్ష్మణరావు, జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ దువ్వాడ శ్రీనివాస్., మామిడి శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.