ఢిల్లీ: గత కొంతకాలంగా సొంతపార్టీపై నిప్పులు చెరుగుతున్న వైఎస్సాఆర్ కాంగ్రెస్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు మరోసారి సంచల వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన పార్లమెంట్ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. అమరావతి భూములపై సీబీఐ ఎంక్వైరీ చేపట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలు ధర్నాలు చేశారు. కానీ అంతర్వేది ఘటనపై ఎందుకు మాట్లాడటం లేదు అని ప్రశ్నించారు? న్యాయవ్యవస్థనే తూలనాడేలా ధర్నాలు చేయడం సిగ్గుచేటని పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని మార్చే హక్కు శాసనసభకు లేదన్న కనీస అవగాహన లేకుండా విజయసాయిరెడ్డికి లేదంటూ ఫైర్ అయ్యారు. ‘కరోనా తగ్గాక నేను పులివెందులకు వెళ్తా.. అక్కడ 10 వేల మందితో సభపెడతా.. ఈ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ఎండగడతా ఎవరు అడ్డొస్తారో చూస్తా’ అంటూ ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు రఘురామకృష్ణం రాజు.
- September 18, 2020
- Archive
- Top News
- ఆంధ్రప్రదేశ్
- ANDHRAPRADESH
- CHANDRABABU
- CM JAGAN
- DELHI
- HYDERABAD
- LOKESH
- TELNGANA
- ఆంధ్రప్రదేశ్
- ఢిల్లీ
- తెలంగాణ
- పార్లమెంట్
- హైదరాబాద్
- Comments Off on జగన్ ఇలాఖాలో సభపెడతా!