Breaking News

చంద్రబాబుకు బిగ్​షాక్​.. గల్లా రాజీనామా!

సారథిన్యూస్​, అమరావతి: సీనియర్​ రాజకీయనేతను అని చెప్పుకొనే చంద్రబాబుకు ఈ మధ్య షాక్​ల మీద షాక్​లు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు పార్టీకి రాజీనామా చేయగా తాజాగా టీడీపీ పొలిట్​బ్యూరో సభ్యురాలు గల్లా అరుణకుమారి తన పదవికి రాజీనామా చేశారు. త్వరలోనే పార్టీకి కూడా గుడ్​బై చెప్పనున్నట్టు సమాచారం.

అరుణకుమారి సుధీర్ఘకాలంపాటు కాంగ్రెస్‌ హయాంలో మంత్రిగా పనిచేశారు. విభజన అనంతరం ఆమె టీడీపీలో చేరారు. ఆమె తనయుడు గల్లా జయదేవ్​ ప్రస్తుతం గుంటూరు ఎంపీగా కొనసాగుతున్నారు. అంతకుముందు 2014లో ఆయన అదే స్థానం నుంచి గెలుపొందారు. ప్రస్తుతం కొంతకాలంగా తల్లీ కొడుకులు ఇద్దరూ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నట్టు సమాచారం. త్వరలోనే గల్లా జయదేవ్​ కూడా పార్టీని విడనున్నట్టు సమాచారం. ఆయన బీజేపీలో చేరతారని కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి.