సారథి న్యూస్, గోదావరిఖని(పెద్దపల్లి): కళను నమ్ముకుని జీవిస్తున్న కళాకారులకు కరోనా వ్యాప్తి కారణంగా కష్టాలు మొదలయ్యాయని, వారికి అండగా నిలుస్తామని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ భరోసాఇచ్చారు. గురువారం ఆయన గోదావరిఖని పట్టణంలోని సీఐటీయూ ఆఫీసులో పేద కళాకారులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. వారికి విజయమ్మ ఫౌండేషన్ ద్వారా ఆర్థిక భరోసా కల్పిస్తామన్నారు.
కళాకారులంతా ఐక్యంగా ఉండాలని, త్వరలోనే వెల్ఫేర్ సొసైటీని ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమంలో రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు, బొడ్డు రవీందర్, కళాకారులు కనకం రమణయ్య, దామెర శంకర్ మ్యాజిక్ రాజా రాజమౌళి, రవీందర్ పాల్గొన్నారు.