సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో మంగళవారం 1,430 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 47,705కు చేరిన పాజిటివ్కేసులు నిర్ధారణ అయ్యాయి. మహమ్మారి బారినపడి ఒకేరోజు ఏడుగురు మృతిచెందారు. ఇప్పటివరకు మరణాల సంఖ్య 422 కు చేరింది. ఇప్పటిదాకా 2,93, 077 శాంపిళ్ల టెస్టింగ్ చేశారు. తెలంగాణ వైద్యారోగ్యశాఖ హెల్త్బులెటిన్ను వెల్లడించింది. ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే.. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 703 కరోనా పాజిటివ్కేసులు తేలాయి. రంగారెడ్డి 117, మేడ్చల్105, సంగారెడ్డి 50, ఖమ్మం 14, కామారెడ్డి 43, వరంగల్అర్బన్34, వరంగల్రూరల్20, కరీంనగర్27, జగిత్యాల 18, మహబూబాబాద్27, మెదక్26, జయశంకర్భూపాలపల్లి 27, నల్లగొండ 45, నాగర్కర్నూల్18, నిజామాబాద్48, సిద్దిపేట 14, సూర్యాపేట 27 చొప్పున కేసులు నమోదయ్యాయి.