సారథిన్యూస్, హైదరాబాద్: మనం చాలామంది దొంగల గురించి విని వుంటాం.. చైన్‌స్నాచర్లు, పగటిపూట దొంగలు, రాత్రిపూట దొంగలు, సీజనల్ దొంగలు ఇలా రకరకాల దొంగలు ఉంటారు. కానీ ఇటీవల సైబరాబాద్ పోలీసులకు పట్టుబడ్డది మాత్రం హైటెక్ దొంగ. ఇతగాడు కేవలం ఫ్లైట్‌లోనే ప్రయాణాలు సాగిస్తుంటాడు. నేరుగా స్పాట్‌కు చేరుకుంటాడు. అనంతరం పనిపూర్తిచేసుకొని తిరిగి వెళ్లిపోతుంటాడు. ఈ హైటెక్ దొంగ గురించి సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన గంగాధర్ నొయిడాలో స్థిరపడ్డాడు. అక్కడ ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తాడు. అయితే అతడు కొంతకాలంగా ఈజీమనికి అలవాటు పడ్డాడు. అందులో భాగంగా హైదరాబాద్‌లోని నిర్మానుష్య ప్రదేశాల్లోని ఇండ్లను దోచుకోవాలని ఫిక్స్ అయ్యాడు. ప్లాన్ ప్రకారం హైదరాబాద్‌లోని నిర్మానుష్య ప్రాంతాల్లో ఉన్న ఇండ్లను ముందే ఎంపిక చేసుకుంటాడు. అనంతరం నొయిడా నుంచి హైదరాబాద్‌కు ఫ్లైట్‌లో వస్తాడు. నిర్మానుష్య ప్రాంతానికి క్యాబ్‌లో వెళ్లిపోయి.. తాళం వేసిన ఇంటిని కొల్లగొడతాడు. అనంతరం డబ్బు, నగలు తీసుకొని మళ్లీ ఫ్లైట్‌లో నొయిడాకు చెక్కేస్తాడు. కాగా ఇటీవల అతడిని సైబరాబాద్ పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుడి నుంచి 40 తులాల బంగారం, కిలో వెండి స్వాధీనం చేసుకున్నారు.