సారథిన్యూస్, రామగుండం: తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్‌భగీరథ పథకం.. ఆడబిడ్డలకు వరమని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పేర్కొన్నారు. మంగళవారం గోదావరిఖని పట్టణంలోని సీఎస్పీ కాలనీలో ఎమ్మెల్యే మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… మహిళల మంచి నీటికి కష్టాలు పడవద్దని ప్రతి ఇంటికి నల్లాద్వారా శుద్ధజలం అందిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు, నగర కమీషనర్ ఉదయ్ కుమార్, కార్పొరేటర్లు సాగంటి శంకర్, దాతు శ్రీనివాస్, పాముకుంట్ల భాస్కర్, అడ్డాల గట్టయ్య, నాయకులు పాతపెల్లి ఎల్లయ్య, తోడేటి శంకర్ గౌడ్, జేవీ రాజు, బొడ్డు రవీందర్, ఇరుగురాళ్ల శ్రావన్, అబ్బాస్, అనిల్, శ్రీకాంత్, శ్రీనివాస్, విజయ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సమన్వయ కమిటీ సభ్యులు వీళ్లే!
ఎమ్మెల్యే కోరుకంటి చందర్ రామగుండం నియోజకవర్గ సమన్వయ కమిటీని ఎంపిక చేశారు. 18 మందికి ఈ కమిటీలో చోటుదక్కింది. కమిటీ కన్వీనర్ ఎమ్మెల్యే చందర్ వ్యవహరించనున్నారు. సభ్యులుగా మేయర్ బంగి అనిల్ కుమార్, డిప్యూటి మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు, కోంకటి లక్ష్మినారాయణ, పాత పెల్లి ఎల్లయ్య, తోడేటి శంకర్ గౌడ్, అడ్డాల రామస్వామి, తానిపర్తి గోపాల్ రావు, నారాయణదాసు మారుతి, దీటి బాలరాజ్, మూల విజయారెడ్డి, అచ్చవేణు, చల్లగురుగుల మెగిళి, బోమ్మగాని తిరుపతిగౌడ్, తిరుపతినాయక్, దివాకర్, సీరాజుద్దీన్ తదితరులకు చోటు దక్కింది.