Breaking News

రైతు వేదికలపై అశ్రద్ధ వద్దు

సారథి న్యూస్​, నాగర్​కర్నూల్​: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న రైతువేదికల నిర్మాణాలపై అశ్రద్ధ వహించొద్దని నాగర్​కర్నూల్​ జిల్లా ఇన్​చార్జ్​ కలెక్టర్​ ఎస్​కే యాస్మిన్​ బాషా ఆదేశించారు. గడువులోగా రైతువేదికలు నిర్మాణాలు పూర్తిచేయాలని కోరారు. ఆస్తుల ఆన్​లైన్​ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. బుధవారం ఆమె అదనపు కలెక్టర్ మనుచౌదరితో కలిసి బిజినేపల్లి మండలం మహాదేవునిపేట, బిజినపల్లి, పాలెంలో పర్యటించారు.

ఆస్తుల ఆన్​లైన్​ వివరాలు, రైతు వేదికనిర్మాణాలు తదితరల పనులను పరిశీలించారు. మహాదేవుని పేట గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి శిరీష నిర్వహిస్తున్న ఆస్తిల నమోదు ప్రక్రియను ఆమె పరిశీలించారు. కార్యక్రమంలో పంచాయతీ రాజ్ ఈఈ దామోదరరావు, జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా గ్రామీణ అభివృద్ధిశాఖ అధికారి సుధాకర్, బిజినేపల్లి తహసిల్దార్ అంజిరెడ్డి, ఎంపీడీవో హరినాథ్ గౌడ్, మండల వ్యవసాయశాఖ అధికారి నీతి, ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్ డిప్యూటీ ఈఈ, ఎఈ, ఆయా గ్రామాల సర్పంచులు, కార్యదర్శులు పాల్గొన్నారు.