బాలీవుడ్‌పై డ్రగ్స్పేరుతో భారీ కుట్ర జరుగుతున్నదని ఎంపీ జయబచ్చన్ ఆరోపించారు. మంగళవారం ఉదయం ఆమె రాజ్యసభలో మాట్లాడారు. కొందరు పనిగట్టుకొని బాలీవుడ్‌కు మచ్చ తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నారని పేర్కొన్నారు. ఎవరైనా డ్రగ్స్ తీసుకొని ఉంటే లేదా డ్రగ్స్ మాఫియా నడిపితే అది తప్పే.. అంత మాత్రం చేత మొత్తం బాలీవుడ్‌నే నిందించడం సరికాదు. డ్రగ్స్ వ్యవహారంపై నిస్పాక్షిక విచారణ సాగాలని ఆమె కోరారు. సోషల్ మీడియా వేదికగా సినీ నటులను వేధిస్తున్నారని… ఇది సరికాదన్నారు. అంతకు ముందు ఈ అంశంపై భోజ్‌పురి నటుడు, ఎంపీ రవికిషన్ మాట్లాడారు. బాలీవుడ్లో చాలమంది నటులు, నిర్మాతలు, దర్శకులు డ్రగ్స్ తీసుకుంటున్నారని ఆరోపించారు. దీంతో జయా స్పందించారు. సినిమా వాళ్లే ఇలా మాట్లాడితే ఎలా ? అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలీవుడ్ వాళ్లు డ్రగ్స్ తీసుకుంటారంటూ సినిమా వాళ్లే మాట్లాడం సిగ్గుచేటని ఆమె వ్యాఖ్యానించారు.