Breaking News

పెండింగ్​ బకాయిలు ఇప్పించండి

సారథి న్యూస్, రామగుండం: తమకు వేతనాలు ఇప్పించాలని రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేస్తున్న పీఆర్​పీ కోరారు. ఈ మేరకు వారు రామగుండం మున్సిపల్​ కమిషనర్​ ఉదయ్​కుమార్​కు వినతిపత్రం సమర్పించారు. జీతాలు లేక చాలా రోజులుగా ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో సీపీఐ నగర కార్యదర్శి కె.కనకరాజు, సహాయ కార్యదర్శి మద్దెల దినేశ్​ ఉన్నారు.