సారథిన్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పామాయిల్ సాగును ప్రోత్సహించాలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కోరారు. రాష్ట్రానికి కాళేశ్వరం జలాలు పుష్కలంగా వస్తున్నాయని.. ఖమ్మం జిల్లాకు వరప్రదాయిని అయిన సీతారామ ప్రాజెక్టు జలాలు కూడా త్వరలోనే వస్తాయని అందువల్ల ప్రభుత్వం పామాయిల్ సాగును ప్రోత్సహిస్తే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని రైతులు లాభపడతారని పేర్కొన్నారు. బుధవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. పామాయిల్ మొక్కల పెంపకానికి ప్రభుత్వం ప్రోత్సాహకం అందించాలని కోరారు. రాష్ట్రంలో కొత్తగా ఫ్యాక్టరీలు కూడా ఏర్పాటు చేయాలన్నారు.
- September 10, 2020
- Archive
- తెలంగాణ
- షార్ట్ న్యూస్
- ASSEMBLY
- HYDERABAD
- KAMMAM
- MLA
- SANDRA
- SATTUPALLY
- TELANGANA
- VEERAIAH
- అసెంబ్లీ
- తెలంగాణ
- హైదరాబాద్
- Comments Off on పామాయిల్ సాగును ప్రోత్సహించాలి