బాలీవుడ్ హీరోయిన్లు దీపికా పదుకొనే, సారాఅలీఖాన్ శనివారం ఎన్సీబీ (నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో) విచారణకు వెళ్లారు. అయితే వాళ్లు ఏం చెబుతారన్న విషయంపై ప్రస్తుతం తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉన్నది. బాలీవుడ్ డ్రగ్స్‌కేసులో అరెస్టయిన రియా చక్రవర్తి వీరి పేర్లు చెప్పిన విషయం తెలిసిందే. దీంతో దీపికా, సారాకు గతంలోనే ఎన్సీబీ నోటీసులు ఇచ్చింది. వీళ్లిద్దరూ బాలీవుడ్ అగ్రహీరోల పేర్లు రివీల్ చేసే అవకాశం ఉన్నదా? లేక డ్రగ్స్ మాఫియా గురించి కీలక సమాచారం వెల్లడిస్తారా? అని సర్వతా ఆసక్తి నెలకొని ఉన్నది.
ఇప్పటికే సుశాంత్ మాజీ ప్రేయసి రియా చక్రవర్తి, మరో నటి రకుల్‌ప్రీత్ సింగ్ ఎన్సీబీ ఎదుట విచారణకు హాజరయ్యారు. శుక్రవారం దీపికా మేనేజర్ కరిష్మా ప్రకాష్, సినీనటి రకుల్ ప్రీత్ సింగ్ లను ప్రశ్నించారు. అయితే దీపికా మేనేజర్ కరిష్మా పలు కీలక ఆధారాలను ఎన్సీబీకి చెప్పినట్టు సమాచారం. ఇవాళ మరోసారి కరష్మా విచారణకు హాజరుకానున్నారు. దీపికాను కరిష్మాను ఎదురెదురుగా కూర్చోబెట్టి విచారణ చేపట్టనున్నారు. అయితే గోవాలో ఓ చిత్ర షూటింగ్లో ఉన్న దీపికా విచారణ కోసం శుక్రవారం రాత్రి భర్త రణ్ వీర్ సింగ్‌తో కలిసి ముంబైకు వెళ్లింది. ఇక సారా అలీ ఖాన్ కూడా గోవాలో ఉండగా.. ఆమె తల్లి అమృతా సింగ్. సోదరుడు ఇబ్రహీం అలీ ఖాన్‌లతో కలిసి సాయంత్రం 5 గంటలకు ముంబై వెళ్లింది. అయితే ఇప్పుడు విచారణలో వీరు ఏం చెబుతారని అని తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉన్నది.