Breaking News

కరోనా కట్టడిలో విఫలం

సారథిన్యూస్​, హైదరాబాద్​: రాష్ట్రంలో కరోనా కేసులు పెరగడానికి సీఎం కేసీఆరే కారణమని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్​ కోదండరాం ఆరోపించారు. సకాలంలో టెస్టులు చేసి కరోనా బాధితులను క్వారంటైన్ చేసి ఉంటే కరోనా అదుపులోకి వచ్చిఉండేదన్నారు. కానీ సీఎం కేసీఆర్​ కరోనా ఉధృతిని తక్కువచేసి చూపేందుకు ప్రయత్నించారని మండిపడ్డారు. కరోనా బాధితులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ గురువారం ఆయన ఒకరోజు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి పేదకుటుంబానికి రూ.7500 సాయం చేయాలని కోరారు. పేదలకు న్యాయం జరిగే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. టీడీపీ అధ్యక్షుడు ఎల్​ రమణ మాట్లాడుతూ.. కరోనా సోకిన పేదలకు గాంధీలో.. టీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలకేమో యశోధలో చికిత్స నందిస్తున్నారని విమర్శించారు. ఈ దీక్షలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్​రెడ్డి తదితరులు పాల్గొన్నారు.