సారథి న్యూస్, ములుగు: గోదావరి నదిపై కరకట్ట నిర్మించేందుకు నిధులు విడుదల చేయాలని నీటిపారుదలశాఖ కార్యదర్శి రజత్ కుమార్ కు ములుగు ఎమ్మెల్యే సీతక్క వినతిపత్రం ఇచ్చారు. సోమవారం ఆమె హైదరాబాద్‌లో రజత్‌కుమార్‌ను కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. ములుగు నియోజకవర్గంలోని మూడు మండలాల గుండా దాదాపు 100 కి.మీ.మేర గోదావరి ప్రవహిస్తుందని చెప్పారు. ఏటా వచ్చే వరదల వల్ల వందలాది ఎకరాల పంట పొలాలు కోతకు గురవుతున్నాయని చెప్పారు. ఏటూరు నాగారం మంగపేట మండల కేంద్రాలతో పాటు కొన్ని గ్రామాలు ముంపునకు గురవుతున్నాయని వివరించారు. గోదావరి నదిపై వరద ఉధృతిని తట్టుకునేందుకు కరకట్ట నిర్మాణానికి రూ.137 కోట్లు జీవో నం.264 ద్వారా పనులు మంజూరు చేసినప్పటికీ కొత్త టెండర్ పిలవలేదని, పాత కాంట్రాక్టును రద్దుచేసి కొత్త టెండర్లు పిలవాలని కోరారు.
- October 5, 2020
- Archive
- వరంగల్
- షార్ట్ న్యూస్
- ANDHRAPRADESH
- HYDERABAD
- MLA
- MULUGU
- TELANGANA
- WARANGAL
- తెలంగాణ
- హైదరాబాద్
- Comments Off on కరకట్ట కోసం నిధులు ఇవ్వండి