– అనంతపురం కలెక్టర్ గంధం చంద్రుడు సారథి న్యూస్, అనంతపురం: హిందూపురం రెడ్ జోన్లలో ప్రతి ఒక్కరికీ మూడు మాస్కులు, శానిటైజర్లు అందజేయాలని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశించారు. శనివారం సాయంత్రం హిందూపురం పట్టణంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో కరోనా నివారణకు తీసుకుంటున్న చర్యలను చర్చించారు. ప్రజలంతా ఇళ్లలోనే ఉండేలా, సామాజిక దూరం పాటించేలా రెడ్ జోన్లలో ఆటోల ద్వారా ప్రచారం చేయాలని తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. ఎవరికైనా అనుమానిత లక్షణాలు ఉంటే టోల్ […]