సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో బుధవారం నుంచి 6, 7, 8వ తరగతి విద్యార్థులకు తరగతులను ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు తరగతులు ప్రారంభించాలని నిర్ణయించినట్లు ఆమె వెల్లడించారు. అయితే తరగతులను మార్చి 1వ తేదీలోగా ప్రారంభించుకోవచ్చని సూచించారు. స్కూళ్లకు హాజరయ్యే విద్యార్థులు కరోనా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి తీసుకోవాలని మంత్రి స్పష్టంచేశారు.