సారథి న్యూస్, మహబూబ్ నగర్: భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని అమిస్తాపూర్ లోని కరోనా హాట్‌స్పాట్ ఏరియాలో మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ఆదివారం పర్యటించారు. కరోనా నిర్మూలనకు ప్రతిఒక్కరూ సహకరించాలని సూచించారు. కరోనా ప్రభావిత ప్రాంతాల్లో సోడియం హైపోక్లోరైడ్‌ను ఫైర్ ఇంజన్ ద్వారా పిచికారీ చేయించారు. వారి వెంట మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్లు ఉన్నారు.