సారథి న్యూస్, మెదక్: ఉమ్మడి మెదక్ జిల్లా పంచాయతీరాజ్ సూపరింటెండెంట్ ఇంజినీర్(ఎస్ఈ)గా కనకరత్నం సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఇక్కడ ఎస్ఈగా పనిచేసిన వేణుమోహన్ ఉద్యోగ విరమణ చేయడంతో ఆయన స్థానంలో సిద్దిపేట జిల్లా పంచాయతీరాజ్ ఈఈగా పనిచేస్తున్న కనకరత్నంకు ఎస్ఈగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ చీఫ్ ఇంజనీర్(ఈఎన్సీ) ఉత్తర్వులిచ్చారు. ఈ మేరకు మెదక్ పట్టణంలోని పంచాయతీరాజ్ సర్కిల్ ఆఫీస్ లో ఆయన బాధ్యతలు స్వీకరించారు. కనకరత్నం గతంలో మెదక్ జిల్లాలో […]