Breaking News

సిద్దిపేట

వాగులో ఒకరు గల్లంతు

వాగులో ఒకరి గల్లంతు

సారథి న్యూస్​, సిద్దిపేట: భారీ వర్షాలు కురుస్తున్న వేళ సిద్దిపేట జిల్లాలో ప్రమాదం సంభవించింది. సోమవారం నంగునూరు మండలం దర్గపల్లి గ్రామం సమీపంలో ఉన్న వాగును దాటుతుండగా ప్రమాదవశాత్తు నీటిలో ఇన్నోవా కారు కొట్టుకుపోయింది. అందులో ఉన్న ముగ్గురిని ఎస్సై అశోక్ పోలీస్ సిబ్బంది, గ్రామస్తుల సహాయంతో కాపాడారు. కారుతో పాటు మరొకరి ఆచూకీ లభించలేదు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందినవారు ముగ్గురు మంథని వద్ద ఇసుక క్వారీలో సూపర్ వైజర్లుగా పనిచేస్తున్నారు. కొన్నిరోజులుగా వర్షాలు కురుస్తున్నందున […]

Read More
పోలీస్​ కమిషనరేట్​ను కంప్లీట్​ చేయండి

పోలీస్​ కమిషనరేట్​ను కంప్లీట్​ చేయండి

సారథి న్యూస్, సిద్దిపేట: సిద్దిపేట నూతన పోలీస్ కమిషనరేట్ పనులను తొందరగా పూర్తిచేయాలని అధికారులు, కాంట్రాక్టర్లను మంత్రి టి.హరీశ్​రావు ఆదేశించారు. సిద్దిపేట జిల్లా దుద్దెడ గ్రామశివారులో నిర్మిస్తున్న కొత్త పోలీస్ కమిషనరేట్ పనులను ఆదివారం జిల్లా కలెక్టర్​ పి.వెంకట్రామరెడ్డి, పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ తో కలిసి పరిశీలించారు. హైవేకు ఆనుకుని కమిషనరేట్​కు వచ్చేలా దారి అంశంపై పోలీస్ అధికారులతో చర్చించారు. 7.30 ఎకరాల విస్తీర్ణంలో పోలీస్ పరేడ్ గ్రౌండ్, పోలీస్ క్వార్టర్స్, ఏఆర్ హెడ్ క్వార్టర్స్​తదితర […]

Read More
వాగులో చిక్కిన డ్రైవర్.. శ్రమించిన రెస్క్యూ టీం

వాగులో చిక్కిన డ్రైవర్.. శ్రమించిన రెస్క్యూ టీం

సారథి న్యూస్, హుస్నాబాద్: వాగు నీటిలో కొట్టుకుపోయిన లారీడ్రైవర్ ప్రాణాలను కాపాడేందుకు తీవ్రంగా శ్రమించిన రెస్క్యూ టీం, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు.. చివరికి ఆచూకీ లభించకపోడంతో వెనుదిరిగాయి. ఇటీవల కురిసిన భారీవర్షాలకు సిద్దిపేట జిల్లా కొహెడ మండలం బస్వాపూర్ గ్రామ సమీపంలోని మోయతుమ్మెద వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. శనివారం తెల్లవారుజామున వరంగల్లు వైపునకు లారీ(టీఎస్ 02 యూబీ 1,836) వెళ్తోంది. ఈ క్రమంలో డ్రైవర్, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ముదిమడక శంకర్(37) ఎప్పటిలాగే వెళ్లేందుకు ప్రయత్నించగా లారీ ఒక్కసారిగా […]

Read More
ప్లాస్మా దానం చేయండి

ప్లాస్మా దానం చేయండి

సారథి న్యూస్, సిద్దిపేట: సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్​ కాలేజీలో కోవిడ్​ టెస్టింగ్ ​ల్యాబ్​ను మంత్రి టి.హరీశ్​రావు శుక్రవారం ప్రారంభించారు. అనంతరం సిద్దిపేట మున్సిపల్ ఆఫీసు ఆవరణలో కరోనా మొబైల్ టెస్టింగ్ బస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా కరోనాను జయించినవారు ప్లాస్మాను దానం చేసేందుకు ముందుకు రావాలని మంత్రి కోరారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మున్సిపల్​ అధికారులు పాల్గొన్నారు.

Read More
దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి కన్నుమూత

దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి కన్నుమూత

సారథి న్యూస్​, మెదక్​: సిద్దిపేట జిల్లా దుబ్బాక శాసనసభ్యుడు సోలిపేట రామలింగారెడ్డి కన్నుమూశారు. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి మృతిచెందారు. రామలింగారెడ్డికి భార్య కూతురు, కుమారుడు ఉన్నారు. 2004, 2008, 2014, 2019 ఎన్నికల్లో నాలుగు సార్లు దుబ్బాక నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిచారు. 2001 నుంచి టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ తో కలసి తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. 25 ఏళ్ల పాటు జర్నలిస్టుగా పనిచేశారు. ప్రజాసమస్యలు, […]

Read More
కరోనాకు భయపడకండి

కరోనాకు భయపడకండి

సారథి న్యూస్​, సిద్దిపేట: సిద్దిపేట జిల్లా ములుగు మండలం లక్ష్మక్కపల్లి ఆర్వీఎం ఆస్పత్రిలో కోవిడ్ టెస్టింగ్ ల్యాబ్ ను తెలంగాణ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి టి.హరీశ్​రావు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా గురించి భయపడకండి.. మానసికంగా కృంగిపోవద్దు. ధైర్యంగా కాపాడాలని సూచించారు. కరోనా వచ్చినవారు ఎవరికీ చెప్పకుండా సొంత వైద్యం చేసుకోవద్దని డాక్టర్ ను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ చైర్మన్ […]

Read More
పోచమ్మగుడిలోకి గుడ్డెలుగు

పోచమ్మగుడిలోకి గుడ్డెలుగు

సారథి న్యూస్, హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా కొహెడ మండలం పెద్దసముద్రాల గ్రామంలోని పోచమ్మ గుడిలో ఎలుగుబంటి ప్రవేశించడం ఆసక్తిరేపింది. శుక్రవారం రాత్రి ఎస్సీ కాలనీ సమీపంలో ఉన్న పోచమ్మ ఆలయంలోకి గుడ్డెలుగు ప్రవేశించగానే గ్రామస్తులు గుడిగేట్లను మూసి తాళం వేశారు. అనంతరం అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. గుడ్డెలుగు సంచారంతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నామని గ్రామస్తులు, రైతులు వ్యక్తం చేస్తున్నారు.

Read More
నాచారుపల్లిలో సంతోషంగా గృహప్రవేశాలు

నాచారుపల్లిలో సంతోషంగా గృహప్రవేశాలు

సారథి న్యూస్​, సిద్దిపేట: సిద్దిపేట జిల్లా నాచారుపల్లిలో నూతనంగా నిర్మించిన 36 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రవేశాలు శుక్రవారం చేశారు. ముఖ్య​అతిథిగా హాజరైన మంత్రి హరీశ్​రావు మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్​ ఆశీస్సులతో డబుల్​ బెడ్​రూమ్​ ఇళ్లు నిర్మించి ఇచ్చామన్నారు. పేదలకు ఒక్క రూపాయి ఖర్చులేకుండా సకల వసతులతో ఇళ్లు ఇచ్చామన్నారు. ‘గుడిసె తప్ప గూడు ఎరుగని మాకు దేవుడిలా సీఎం కేసీఆర్​ వరం ఇచ్చారని’ లబ్ధిదారులు కొనియాడారు. కార్యక్రమంలో సుడా […]

Read More