సారథి న్యూస్, మెదక్: మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మెదక్ జిల్లాలో ప్రాజెక్టులు, చెరువు లు, కుంటలు, చెక్ డ్యాంలు పూర్తిగా నిండి పొంగిపొర్లుతున్నాయి. ఎగువన సంగారెడ్డి జిల్లా లోని సింగూరు ప్రాజెక్టు పూర్తిగా నిండటం తో గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. దీంతో మంజీరా నది భారీ వరద ప్రవాహాన్ని సంతరించుకుంది. కొల్చారం మండలం చిన్నఘనపూర్ వద్ద నిర్మించిన వనదుర్గా ప్రాజెక్ట్ పొంగిపొర్లుతోంది. దీంతో మంజీరా నదీ పాయలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. హల్దీ […]
సారథి న్యూస్, మెదక్: మెదక్ జిల్లాలోని వనదుర్గా ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ఇటీవల మంజీరా నది పరీవాహక ప్రాంతంలో కురిసిన వర్షాలకు ఎగువ నుంచి వరద వచ్చి ఆనకట్టలోకి పూర్తిస్థాయిలో నీరు చేరింది. 0.2 టీఎంసీల సామర్థ్యం కలిగిన ఆనకట్ట పూర్తిగా నిండింది. ఘనపూర్ ఆనకట్ట కింద కొల్చారం, మెదక్, హవేలీ ఘనపూర్, పాపన్నపేట మండలాల్లో 21,625 ఎకరాల ఆయకట్టు ఉంది. ఆనకట్ట పూర్తిస్థాయిలో నిండడంతో మహబూబ్నహర్, ఫతేనహర్కాల్వల ద్వారా ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేసే అవకాశం […]