సారథి న్యూస్, ఏడుపాయల(మెదక్): భక్తుల కొంగుబంగారంగా విలసిల్లిన ఏడుపాయల వన దుర్గాభవాని మాత సన్నిధిలో కార్తీక పౌర్ణమి సందర్భంగా సోమవారం సాయంత్రం లక్షదీపోత్సవ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ముందుగా ఎమ్మెల్యే దుర్గ భవాని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేకపూజలు చేశారు. అనంతరం పల్లకీసేవలో పాల్గొన్నారు. గంగమ్మకు ప్రత్యేక పూజలు చేసి తెప్పోత్సవం నిర్వహించారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని లక్ష దీపోత్సవం కార్యక్రమంలో పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొని దీపాలను వెలిగించి […]