సారథి న్యూస్, వైరా: ప్రభుత్వ అధికారుల్లో కొందరు చేస్తున్న నీచమైన పనుల వల్ల మొత్తం వ్యవస్థకే మచ్చ ఏర్పడుతుంది. రేషన్ కార్డు మంజూరు చేసేందుకు లంచం తీసుకుని తాజాగా ఓ ఉద్యోగి ఏసీబీకి చిక్కాడు. ఖమ్మం జిల్లా వైరా మండలం గొల్లపడికి చెందిన ఓ వ్యక్తి రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నాడు. కార్డు మంజూరు చేయాలంటే రూ.1500 లంచం ఇవ్వాలంటూ వీఆర్వో కశ్యప్ డిమాండ్ చేశాడు. దీంతో సదరు వ్యక్తి ఏసీబీని ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన […]
సారథిన్యూస్, చేవెళ్ల: భూ వివాదంలో లంచం తీసుకుంటూ ఓ సీఐ ఏసీబీకి చిక్కాడు. రంగారెడ్డి జిల్లా షాబాద్ సీఐ శంకరయ్య ఓ వ్యక్తికి సంబంధించిన భూ వివాదాన్ని పరిష్కరించేందుకు రూ. లక్ష 20వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో సదరు వ్యక్తి ఏసీబీని ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు గురువారం షాబాద్ పీఎస్‌లో శంకరయ్య యాదవ్, ఏఎస్సై రాజేందర్.. బాధితుడి నుంచి లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సీఐ శంకరయ్యపై గతంలోనూ అవినీతి కేసులున్నాయి. రంగారెడ్డి […]
సారథిన్యూస్, కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన నీటిపారుదల శాఖ ఏఈ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ మధుసూదన్ తెలిపిన వివరాల ప్రకారం..ఇల్లెందు మండలం కోటన్ననగర్ సమీపంలోని అనంతారం చెరువు పునరుద్ధరణ పనులు మిషన్ కాకతీయ పథకంలో భాగంగా చేపట్టారు. పనులు పూర్తి చేసిన కాంట్రాక్టర్ గుండ్ల రమేష్ ఎంబీ చేసి బిల్లు మంజూరు కోసం కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. ఈ క్రమంలో క్వాలిటీ కంట్రోల్ తనిఖీ కూడా పూర్తి కావడంతో బిల్లు […]