సారథి న్యూస్, హైదరాబాద్: రాష్ట్రంలో అమలవుతున్న రైతుబంధు పథకం, రైతు సమన్వయ సమితి ఏర్పాటును కేంద్ర ప్రభుత్వం అభినందించింది. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ గురువారం వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వ్యవసాయశాఖ మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొస్తున్న అగ్రికల్చర్ ఇన్ర్ఫాస్ట్రక్షర్ ఫండ్ స్కీంపై రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలు కోరారు. దేశ వ్యవసాయ రంగంలో జరుగుతున్న పరిణామాలను కేంద్ర వ్యవసాయశాఖ కార్యదర్శి సంజయ్ అగర్వాల్ వివరించారు. ఈ సందర్భంగా ఆయన […]