సారథి న్యూస్, మునగాల: క్రషర్ మిల్లులో రాత్రి వేళ నిర్వహిస్తున్న బ్లాసింగ్లు ఆపాలంటూ స్థానికులు ధర్నాకు దిగారు. వివరాల్లోకి వెళితే..సూర్యాపేట జిల్లా మునగాల మండలం మాధవరం గ్రామ శివారులో ఉన్న క్రషర్ మిల్లులో యాజమాన్యం తరచూ రాత్రి వేళ పెద్ద ఎత్తన బ్లాస్టింగ్లు జరుపుతున్నారు. దీంతో స్థానిక ఎస్సీ కాలనీలో నివాసముంటున్న ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఆదివారం క్రషర్ మిల్లు యాజమాన్యం బ్లాసింగ్లు ఆపాలంటూ వారు రోడ్డుపై ధర్నాకు దిగారు. కాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. […]