సారథి న్యూస్, కంగ్టి, నారాయణఖేడ్: ‘అందరినీ సల్లంగా సూడు పోచమ్మ తల్లి’ అంటూ మహిళలు, ఆడపడుచులు అమ్మవారిని వేడుకున్నారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ డివిజన్ కంగ్టి మండలంలోని చాప్టా(కే)గ్రామంలో ఘనంగా బారడీ పోచమ్మ ఉత్సవాలు నిర్వహించారు. గ్రామశివారులో నూతనంగా నిర్మించిన ఆలయంలో విగ్రహప్రతిష్ఠాపన చేశారు. అనంతరం అమ్మవారికి నైవేద్యం పెట్టి మొక్కులు చెల్లించుకున్నారు. సాయంత్రం పెద్దసంఖ్యలో మహిళలు కలశాలు, బోనాలతో ఆలయానికి ఊరేగింపుగా బయలుదేరి వెళ్లారు. అమ్మవారి నామస్మరణతో ఆలయ ప్రాగణం మార్మోగింది. బోనాలు, ఎడ్ల బండ్లు […]