సారథి న్యూస్ ,దుబ్బాక: దుబ్బాక పట్టణంలో గురువారం చేనేత కార్మికుల కుటుంబాలకు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్ రావు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా వ్యాధిని అరికట్టడంలో ప్రధాని నరేంద్ర మోడీ చేస్తున్న కృషి మరువలేనిదన్నారు. ప్రతి ఒక్కరూ కరోనా వైరస్ ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో బాలేష్ గౌడ్, రాజిరెడ్డి, రోశయ్య, సుభాష్ రెడ్డి, ప్రవీణ్ కుమార్, సాయి కుమార్ గౌడ్, భాను పాల్గొన్నారు.
సారథి న్యూస్, మహబూబ్‌నగర్: బీజేపీ అధినాయకత్వం పిలుపు మేరకు మంగళవారం మహబూబ్ నగర్ మండలం ఓబులాయిపల్లిలో ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పడాకుల బాలరాజు ఆధ్వర్యంలో కూరగాయలు పంచిపెట్టారు. రాష్ట్ర మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు అంజమ్మ మాస్క్‌లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో బీజేపీ మండలాధ్యక్షుడు రాజుగౌడ్, జాం శ్రీనివాసులు, కిరణ్ కుమార్ రెడ్డి, రామకృష్ణ, అంజయ్య, దర్పల్లి హరి, శివారెడ్డి పాల్గొన్నారు.
సారథి న్యూస్, రంగారెడ్డి: బీజేపీ జాతీయ, రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు ఫీడ్ ది నీడ్ కార్యక్రమంలో భాగంగా సోమవారం హయత్ నగర్ డివిజన్ లోని ద్వారకామాయి నగర్, హైకోర్ట్ కాలనీ, సాయికాలనీలో పేదలు, వలస కూలీలకు సంబంధించి 150 కుటుంబాలకు కళ్లెం నవజీవన్ రెడ్డి సహకారంతో నిత్యావసర సరుకులు, బియ్యం ఆయిల్, కందిపప్పు, ఉల్లిపాయలు, కూరగాయలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు సామ రంగారెడ్డి, పోచంపల్లి గిరిధర్, బండారి భాస్కర్, పండాల శ్రీధర్ […]