సామాజిక సారథి, వరంగల్: వరంగల్ ఎనుమాముల మార్కెట్ లో మిర్చి ధర మంగళవారం పెరగడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం రూ.18వేలు పలికిన వండర్ హాట్ మంగళవారం రూ.18500, 341 రకం 17500, తేజ రకం రూ.15400 ఉన్నట్టు అధికారులు తెలిపారు. మార్కెట్లో పత్తికూడా రికార్డు ధర పలికింది. రూ.8715 పలికినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. సీజన్ లో పత్తి ధర ఈ విధంగా పలకడం ఇదే మొదటిసారి కావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు