చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. తమిళ నటుడు, మాస్ హీరో, అక్కడి ప్రేక్షకులతో తళపతిగా పిలిపించుకునే విజయ్ రాజకీయాల్లోకి రానున్నట్టు సమాచారం. ఈ మేరకు పలు మీడియా సంస్థల్లో వార్తలు వెలువడ్డాయి. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పోటీచేయనున్నట్టు సమాచారం. అయితే విజయ్ సొంతంగా ఓ రాజకీయపార్టీని స్థాపించి ఎన్నకలబరిలోకి దిగనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకోసం ఆయన తండ్రి, ప్రముఖదర్శకుడు ఎస్ఏ చంద్రశేఖర్ రంగంలోకి దిగారని సమాచారం. త్వరలోనే రాజకీయపార్టీని రిజిస్టర్ చేయుంచనున్నట్టు […]