సారథి న్యూస్, వనపర్తి: వనపర్తి జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కాలేజీ ఆవరణలో వీరనారి ఝల్కారీబాయి 162 వర్ధంతిని టీజేఏసీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ప్రజావాగ్గేయకారుడు రాజారామ్ ప్రకాష్ మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్ర్యం కావాలని పోరాటం కొనసాగించిన ధీరవనిత ఝల్కారీబాయి అని కొనియాడారు. సిపాయిల తిరుగుబాటులో ముఖ్యపాత్ర పోషించి ఝాన్సీ ప్రాంతాన్ని రక్షిందన్నారు. ఆమె స్ఫూర్తితో మనమంతా దేశసమైక్యతకు పునరంకింత కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తగవుల వెంకటస్వామి, కవి పండితుడు గిరిరాజాచారి, యూటీఎఫ్ జిల్లా […]