సారథి న్యూస్, రామడుగు: కరీంనగర్ జిల్లా రామడుగు మాజీ ఎంపీపీ తడగొండ అంజలి మామ తడగొండ పోచమల్లు ఇటీవల అనారోగ్యంతో చనిపోవడంతో ఆ కుటుంబాన్ని జై తెలంగాణ ఫౌండేషన్ చైర్మన్, కేటీఆర్ యువసేన రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ఆర్.వివేకానంద సోమవారం పరామర్శించారు. ఆయన వెంట సర్పంచ్ బక్కశెట్టి నర్సయ్య, ఎంపీటీసీ మోడీ రవీందర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తడగొండ అజయ్, మాజీ ఎంపీటీసీ పెంచాల మల్లారెడ్డి ఉన్నారు.