సారథి న్యూస్, శ్రీకాకుళం: మూగజీవాలను ఆదుకునే క్రమంలో అంకితభావంతో సేవచేసే వారికి గ్రీన్ మెర్సీ సంస్థ అరుదుగా ప్రదానం చేసే ప్రతిష్టాత్మక ‘యాక్షన్ ఫర్ ఎనిమల్స్’ అవార్డుకు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె.నివాస్ ఎంపికయ్యారు. బుధవారం స్థానిక కలెక్టరేట్ లో జరిగిన కార్యక్రమంలో సంస్థ ముఖ్య అధికారి రమణమూర్తి ఈ అవార్డును కలెక్టర్కు అందజేశారు. మూగజీవాల ఆకలిబాధ తీర్చేందుకు కలెక్టర్ చేపడుతున్న కార్యక్రమాలు ఎనలేనివన్నారు. కార్యక్రమంలో డీఆర్వో బి.దయానిధి, జిల్లా సివిల్ సప్లయీస్ ఆఫీసర్ ఎల్.రమేష్ ఇతర […]