సారథి న్యూస్, వనపర్తి: మట్టిఇంటి మిద్దె కూలి ఐదుగురు మహిళలు మృతి చెందారు. ఈ ఘటన శనివారం అర్ధరాత్రి వనపర్తి జిల్లా గోపాల్పేట మండలం బుద్దారంలో చోటుచేసుకుంది. వనపర్తి జిల్లా గోపాల్పేట మండలం బుద్దారంలో విషాదఘటన జరిగింది. గ్రామానికి చెందిన నర్సింహ ఏడాది క్రితం చనిపోయాడు. ఆయన సంవత్సరీకం కోసం కొడుకులు, కోడళ్లు, మనవరాళ్లు గ్రామానికొచ్చారు. కార్యక్రమం ముగిసింది. ఉక్కపోతకు ఫ్యాన్ ఉందని 11మంది ఒకే గదిలో నిద్రపోయారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు బాగా నానిపోయి […]