సారథి, అచ్చంపేట: దేశంలో ఉన్న అందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్ వేస్తామని ప్రధాని మోడీ ప్రకటించడం గొప్ప నిర్ణయమని బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల రాఘవేందర్ కొనియాడారు. ఇప్పటి వరకు కోట్లాది మంది వ్యాక్సిన్ తీసుకున్నారని తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 18ఏళ్లు పైబడిన వాళ్లందరికీ ఉచితంగా వ్యాక్సిన్ వేయించాలన్న నిర్ణయం చూస్తుంటే కరోనా నుంచి దేశప్రజలను కాపాడటమే కేంద్ర ప్రభుత్వం మొట్టమొదటి ప్రాధాన్యమన్నారు. అంతే కాకుండా దీపావళి(నవంబర్) వరకు దేశంలో గరీబ్ కళ్యాణ్ […]