అసిఫాబాద్: ఆసిఫాబాద్ కొమురంభీం జిల్లా కదంబా అటవీప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఈనెల 19న ఇద్దరు మావోయిస్టులు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మావోయిస్టుల కదలికలపై పోలీసులు మరింత నిఘాపెంచారు. మావోయిస్టు రాష్ర్ట కమిటీ సభ్యుడు అడెల్లు అలియాస్ భాస్కర్ లక్ష్యంగా కూంబింగ్ చేపడుతున్నారు. అడవుల్లో తప్పించుకున్న మావోయిస్టుల ఆచూకీని తెలుసుకునేందుకు డ్రోన్ కెమెరాల సాయంతో తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. నదీ పరివాహక ప్రాంతాలు, దట్టమైన అడవులను డ్రోన్ల సహాయంతో గ్రేహౌండ్స్ బలగాలు, పోలీసులు జల్లెడ పడుతున్నారు. పెంచకల్పేట […]