సారథి న్యూస్, అనంతపురం: బీఎస్-3 వెహికిల్స్‌ను బీఎస్-4గా రిజిస్ట్రేషన్ చేయించారన్న అభియోగాలపై అరెస్టయిన ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాకు చెందిన మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి సోదరుడు, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన కొడుకు అస్మిత్‌రెడ్డిని పోలీసులు తాజాగా కడప సెంట్రల్ జైలుకు తరలించారు. అనంతపురం జిల్లాకు చెందిన ఇద్దరు డీఎస్పీలు, ముగ్గురు ఇన్స్పెక్టర్లు, ముగ్గురు ఎస్సైలు, నలుగురు సిబ్బంది శనివారం తెల్లవారుజామున హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ప్రభాకర్‌రెడ్డి ఇంటి తలుపు తట్టి వారిపై ఉన్న అభియోగాలను […]