సారథి, కోడేరు(కొల్లాపూర్): కోడేరు మండల కేంద్రంలోని వడ్డెర కాలనీలో విషజ్వరాల బారినపడిన ప్రతిఒక్కరినీ ఇంటింటికి తిరిగి కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి బుధవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. కాలనీలో ప్రత్యేకంగా క్యాంపును ఏర్పాటుచేసి మెరుగైన వైద్యం అందిస్తామన్నారు. అవసరమైతే హైదరాబాద్ఆస్పత్రికి తీసుకెళ్తామన్నారు. అంబులెన్స్‌లో అందుబాటులో ఉంటాయని తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఆర్థికసాయం అందేలా చూస్తామన్నారు. అలాగే రైతుబీమా వచ్చేలా చూస్తామని హామీ […]
సారథి, కొల్లాపూర్: పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాల రూపురేఖలు మారనున్నాయని నాగర్‌కర్నూల్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ పద్మావతమ్మ, కలెక్టర్ ఎల్.శర్మన్, ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. సోమవారం కొల్లాపూర్ మండలం ఎల్లూరు, ముక్కిడిగుండం, పెంట్లవెల్లి మండలంలోని జటప్రోలు గ్రామాల్లో పల్లెప్రగతి కార్యక్రమంలో మొక్కలు నాటారు. మన ఇంటిని, వీధిని, ఊరును మనమే శుభ్రంగా ఉంచుకోవాలని, పల్లె ప్రగతి కార్యక్రమం ఉద్దేశం అదేనని వివరించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో […]
సారథి, కొల్లాపూర్: పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి అన్నారు. రైతును రాజుగా చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని కొనియాడారు. ఆదివారం నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం నక్కలపల్లి, వెన్నచర్ల గ్రామాల్లో పల్లెప్రగతి, హరితహారం కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అధికారులు, ప్రజలతో కలిసి పల్లెప్రగతి కార్యక్రమం గురించి తెలుసుకున్నారు. అనంతరం మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ.. గ్రామాల్లో చెత్తాచెదారం లేకుండా ఇంటింటా చెత్తసేకరణ, […]
సారథి, కొల్లాపూర్: కరోనా మహమ్మారి బారినపడి తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు తక్షణ సాయం కింద ప్రభుత్వం మంజూరుచేసిన రూ.రెండువేల ఆర్థిక సహాయం చెక్కులను గురువారం ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అందజేశారు. నాగర్‌కర్నూల్‌జిల్లా కొల్లాపూర్ మండల పరిధిలో 10మంది చిన్నారులకు చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో సీడీపీవో వెంకట రమణమ్మ, ఐసీడీఎస్ నిరంజన్, సూపర్వైజర్లు పాల్గొన్నారు.సీఎం రిలీఫ్‌ఫండ్ చెక్కుల పంపిణీనిరుపేదలకు సీఎం రిలీఫ్ఫండ్వరంగా మారిందని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆయన కొల్లాపూర్ పట్టణంలోని ఎమ్మెల్యే […]
సారథి న్యూస్, కొల్లాపూర్: నియంత్రిత వ్యవసాయ సాగుతో రైతులకు లాభమేనని కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి అన్నారు. బుధవారం పాన్‌గల్ తహసీల్దార్ ఆఫీసు ఆవరణలో రైతులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. రైతులు భూసార పరీక్షలు చేయించాలని, అధికారుల సూచనలు, సలహాలు పాటించాలని సూచించారు. అనంతరం 55 మంది దరఖాస్తుదారులకు రూ.55లక్షల కల్యాణలక్ష్మీ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీఏవో సుధాకర్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి, ఎంపీపీ శ్రీధర్ రెడ్డి, జడ్పీటీసీ […]
సారథి న్యూస్, నాగర్ కర్నూల్: కొల్లాపూర్ నియోజకవర్గంలోని మాచినేనిపల్లి శివారులోని ఎండోమెంట్ భూమిని అడిషినల్ కలెక్టర్ హన్మంత్ రెడ్డితో కలిసి స్థానిక ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి మంగళవారం పరిశీలించారు. నియోజకవర్గంలో విరివిగా విస్తరించి ఉన్న మామిడి పంటలకు స్థానికంగానే మార్కెట్ ఏర్పాటు చేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు నూతనంగా మార్కెట్ ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కొల్లాపూర్ మామిడికి అంతర్జాతీయంగా డిమాండ్ ఉందన్నారు. నూతన మార్కెట్ తో ఇక్కడి రైతుల కష్టాలు తీరనున్నాయని, రైతుల […]