సామాజిక సారథి, వైరా: ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ మంగళవారం తహసీల్దార్ నారపోగు అరుణకు మండలంలోని వల్లాపురం గ్రామానికి చెందిన పలువురు వినతిపత్రాన్ని అందజేశారు. గ్రామంలోని స్థలాలను తమకు స్వాధీనం చేసి ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి తోట నాగేశ్వరరావు, నాయకులు బాజోజు రమణ, వెంకటేశ్వరరావు, నాగేశ్వరరావు, జి. దేవానందం, జి.కృష్ణారావు జి.కిషోర్ జి.రామారావు, జి.భాస్కర్ పాల్గొన్నారు.