సామాజిక సారథి, హైదరాబాద్: కష్టాల్లో ఉన్న టీఎస్ ఆర్టీసీని గట్టెక్కించేందుకు కంకణం కట్టుకున్నారు ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్. ఎండీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ఆర్టీసీని ప్రయాణికులకు మరింత చేరువచేసేందుకు అనేక వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. పలు సందర్భాల్లో ఓ సాధారణ ప్రయాణికుడిలా స్వయంగా ప్రయాణించారు. తాజాగా ఆయన తన కుటుంబసభ్యులు, బంధుమిత్రులతో సపరివార కుటుంబ సమేతంగా బస్సులో సందడి చేశారు. టీఎస్ ఆర్టీసీలో ప్రయాణం సురక్షితం, సుఖమయం, శుభప్రదం అని ప్రయాణికులకు వరించేలా […]