సారథి న్యూస్, గద్వాల: భక్తుల పాలిట కల్పతరువు మంత్రాలయం గురురాఘవేంద్ర స్వామి 349వ ఆరాధనోత్సవాలు మంత్రాలయం పీఠాధిపతులు సుభుదేంద్ర స్వామి ఆదేశాల మేరకు జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని నదిఅగ్రహారం రోడ్డులోని రాఘవేంద్రస్వామి మఠంలో మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. అర్చకులు ప్రహ్లాద్ ఆచారి, ప్రమోద్ ప్రసన్నచారి స్వామివారి బృందావనానికి పంచామృతాభిషేకం, తులసి అర్చన, పుష్పాభిషేకం, హస్తోదకం కార్యక్రమాలను నిర్వహించారు. మూడు రోజుల పాటు జరిగే ఆరాధనోత్సవాలకు భక్తులు మాస్కులు కట్టుకుని.. భౌతిక దూరం పాటిస్తూ దర్శనానికి రావాలని […]