నీట మునిగిన లోతట్టు కాలనీలు పరిశీలించిన ఎమ్మెల్యే, అధికారులు సారథి న్యూస్, ఆత్మకూరు(కర్నూలు): రెండు రోజులుగా కురుస్తున్న భారీవర్షాలకు జిల్లాలోని ఆత్మకూరు పట్టణం జలమయంగా మారింది. సమీపంలోని వాగులు, వంకలు పోటెత్తడంతో వరద పట్టణంలోకి వచ్చిచేరింది. సోమవారం పట్టణంలోని పలు కాలనీల్లో ఎమ్మెల్యే శిల్పాచక్రపాణిరెడ్డి, జేసీ ఖాజామొయినుద్దీన్ స్థానిక అధికారులతో కలిసి పర్యటించారు. లోతట్టు కాలనీల్లో ముమ్మరంగా సహాయక చర్యలు చేపట్టారు. ఇళ్లచుట్టూ నీళ్లు చేరిన వారికి స్కూళ్లలో ఆశ్రయం కల్పించారు. బాధితులకు ప్రభుత్వం నుంచి సాయం […]