బెంగళూరు: కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ప్రముఖులు, రాజకీయ నాయకులు ఈ వైరస్ బారిన పడుతున్నారు. ఆదివారం కేంద్ర మంత్రి అమిత్‌షాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. తాజాగా కర్ణాటక సీఎం యడూయురప్పకు కరోనా సోకింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయన ట్విట్టర్లో వెల్లడించారు. అయితే ప్రస్తుతం తాను ఆరోగ్యంగానే ఉన్నానని చెప్పారు. ఇటీవల తనను కలిసిన వారంతా హోం క్వారంటైన్లోకి వెళ్లాలని.. వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. మరోవైపు యడూయురప్ప కూతురుకు […]