సారథి న్యూస్ , నల్లగొండ: ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడి అందరి ప్రశంసలు అందుకున్నాడో ట్రాఫిక్ పోలీస్.నల్లగొండ జిల్లాకేంద్రంలోని క్లాక్‌టవర్ సెంటర్లో హఫీజ్ ట్రాఫిక్ పోలీస్‌గా పనీచేస్తున్నాడు. బుధవారం ఓ వాహనదారుడు కారులో రాంగ్రూట్లో వస్తుండగా.. హఫీజ్ అతడి కారును ఆపాడు. తాను చెన్నైకి చెందిన ఒక ట్రావెల్ ఏజెన్సీలో డ్రైవరుగా పని చేస్తున్నట్టు డ్రైవర్ తెలిపాడు. హైదరాబాద్ నుంచి నల్లగొండ వైపు వస్తుండగా.. చిట్యాలకు వచ్చినప్పటి నుంచి ఛాతిలో నొప్పి వస్తున్నదని.. […]