సారథి న్యూస్, ములుగు: మహిళల హక్కులకు రక్షణ కల్పించాలని తెలంగాణ ఏకలవ్య ఎరుకల గిరిజన హక్కుల పరిరక్షణ సాధన సంఘం వరంగల్ ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు పాలకుర్తి విజయ్ కుమార్ కోరారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మహిళలపై రాష్ట్ర నలుమూలల ఎక్కడో ఒకచోట ప్రతిరోజు హత్యలు, హత్యాయత్నాలు, అత్యాచారాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. వాటికి అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేశారు.
సారథి న్యూస్, హుస్నాబాద్: మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించించాలని కాకతీయ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్వొడితల షమిత ఆకాంక్షించారు. సోమవారం హుస్నాబాద్ మున్సిపల్ ఆఫీసులో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో ఆమె మాట్లాడారు. మహిళలు కేవలం ఇంటి పనులకే పరిమితం కాదని, వారంతా చైతన్యవంతులై అన్నిరంగాల్లోనూ రాణించాలన్నారు. మన దేశ సంస్కృతి సంప్రదాయాల్లో మహిళలకు విశేష ప్రాధాన్యం ఉందన్నారు. కొడుకుతో సమానంగా కూతుళ్లను చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని, నేటి పోటీ ప్రపంచాన్ని ఎదురుకునే విధంగా మహిళలు […]
సారథి న్యూస్, ములుగు: జిల్లాలోని ఎస్టీయూ భవన్ లో జిల్లా అధ్యక్షుడు ఏళ్ల మధుసూదన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా యూనియన్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి పర్వతరెడ్డి హాజరయ్యారు. దేశంలో స్త్రీని శక్తి స్వరూపిణిగా కొనియాడే సంప్రదాయం ఉందని, అయినా మహిళలు వివక్షకు గురవుతున్నారని అన్నారు. తల్లిగా, చెల్లిగా, భార్యగా అందించే సేవలు మరువలేనివని కొనియాడారు. అనంతరం జిల్లాలో పనిచేస్తున్న ఆరుగురు ఉపాధ్యాయినులు సుమలత, సునిత, సుధారాణి, లవనిక, లలిత, రాజేశ్వరిని అవార్డులతో సత్కరించారు. […]
సారథి న్యూస్, వెంకటాపూర్: కనుపాపల తలచి, ఆత్మీయతను పంచి, కుటుంబం కోసం అహర్నిశలు కష్టించే స్త్రీమూర్తిని స్మరించుకోవడం అందరి బాధ్యత అని సర్వర్ ఫౌండేషన్ సభ్యులు అన్నారు. సోమవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మండలంలోని మహిళామణులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. సర్వర్ ఫౌండేషన్ వ్యస్థాపకురాలు, సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్ ఆదేశాల మేరకు ములుగు జిల్లా వెంకటాపూర్ గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న సిబ్బంది, పోలీసు స్టేషన్ లో మహిళా పోలీస్కానిస్టేబుళ్లు, జవహర్ నగర్ పెట్రోల్ బంకులో […]