సారథి: పెద్దశంకరంపేట: ఓ మహిళ వ్యవసాయ బావిలో పడి చనిపోయింది. ఈ ఘటన శుక్రవారం మెదక్జిల్లా పెద్దశంకరంపేట మండల కేంద్రానికి సమీపంలోని జరిగింది. మండల కేంద్రానికి చెందిన అనూషమ్మ(45) మంళవారం బట్టలు ఉతకడానికి వెళ్లి ప్రమాదవశాత్తు బావిలో పడింది. శుక్రవారం ఉదయం అటుగా వెళ్లిన వారికి ఆమె శవమై కనిపించింది. అనూషమ్మకు దుర్గమణి, సాయమ్మ ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అనూషమ్మ మృతితో విషాదఛాయలు నెలకొన్నాయి. భర్త స్థాయిలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.