Breaking News

wildlife

వన్యప్రాణుల కదలికలను పరిశీలించాలె

వన్యప్రాణుల కదలికలను పరిశీలించాలె

సారథి న్యూస్, ఏటూరునాగారం: ఏటూరునాగారంలోని నార్త్ రేంజ్ పరిధిలోని భూపాతిపూర్ బీట్, గురవేళ్ల బీట్లో నూతనంగా నిర్మిస్తున్న పెర్కోలేషన్ ట్యాంక్ పనులను డీ ఎఫ్ వో ప్రదీప్ కుమార్ శెట్టి శుక్రవారం పరిశీలించారు. పనులు పూర్తి వెంటనే సోలర్ బోర్‌వెల్ ఏర్పాటు చేయాలన్నారు. గతంలో టైగర్ తిరిగిన ప్రదేశం కావునా ఇక్కడ కెమెరా ట్రాప్స్ నిఘా పెంచాలన్నారు. అలాగే వన్యప్రాణుల కదలికలు ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఆదేశించారు. ఆయన వెంట ఏటూరునాగారం ఎఫ్ డీవో వీణావాణి ఉన్నారు.

Read More